బాలయ్య కు బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు దెబ్బ..!

Daggupati Venkateswar Rao

ఇంకొన్ని నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నందమూరి బాలక్రిష్ణ చేస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ ప్రత్యేకతను సంతరించుకుంది. ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ ను గుర్తుచేసి ఓట్లు దండుకోవాలనే ప్రయత్నంలోనే ఈ బయోపిక్ చేస్తున్నారని, దీని ద్వారా బాబు తనను తాను ఒక హీరోలా ప్రెజెంట్ చేసుకోవాలనుకుంటున్నారని ప్రత్యర్థులు అంటున్నారు. ఈ మాటల్లో నిజం లేకపోలేదు కూడ. రెండు భాగాలుగా విడగొట్టిన ఈ సినిమాను ఎన్నికలకు ముందు రిలీజ్ చేసి జనాల్లో పార్టీ పట్ల, నందమూరి కుటుంబం పట్ల, చంద్రబాబు పట్ల ఒక భక్తి భావన కల్పించాలనే ఉద్దేశ్యం తప్పక ఉంది.

అంతా సవ్యంగా జరుగుతుంటే ఈ పథకం ఫలించేదే. కానీ ఒక వ్యక్తి వలన ఆ ప్లాన్ నెగెటివిటీని సంతరించుకుంటోంది. అతనే ఎన్టీఆర్ అల్లుడు, బాలయ్యకు పెద్ద బావ అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఎన్టీఆర్ పార్టీ పెట్టడంలో కీలక పాత్ర పోషించిన ఆయన ఆ తర్వాత కొన్ని కారణాల వలన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. ఎన్టీఆర్ పదవిని కోల్పోవడం, బాబు ముఖ్యమంత్రి కావడం, ఇంత జరుగుతున్నా పెద్దాయన తనయులు బాబుకు మౌన మద్దతును తెలపడం వెనుక ఉన్న కుట్రపూరిత రహస్యాలకు వెంకటేశ్వరరావు ప్రత్యక్ష సాక్షి.అందుకే ఆయన ఈమద్య టీవీలకు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇప్పుడు హడావుడి చేస్తున్నాయి.

బాలక్రిష్ణ, హరిక్రిష్ణల సహకారంతోనే బాబు పార్టీని లాక్కున్నారని వెంకటేశ్వరరావు బల్లగుద్ది చెబుతున్నారు. దీంతో సినిమాలో చూపబోయేది మొత్తం షుగర్ కోటింగ్ కథేనని ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయం బయలుదేరింది. దీని ద్వారా సినిమా నుండి బాలయ్య, చంద్రబాబులు ఆశించిన పాజిటివ్ ఫలితం కాస్త నెగెటివిటీగా మారే ప్రమాదం ఏర్పడింది.