ఫ్యాన్ కింద‌కు ద‌గ్గుబాటి కుటుంబం

Daggubati VenkateswaraRao
Daggubati VenkateswaraRao

వైసీపీలో చేరాలని తాము డిసైడ్ అయిన‌ట్లు తీసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎన్టీఆర్ పెద్ద‌ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు. తమ నిర్ణయాన్ని వైసీపీ అధినేత జగన్ స్వాగతించారని వెల్ల‌డించారు. అనుచరులు, మద్దతుదారులతో చర్చించి, మంచి రోజు చూసుకుని తాను, కుమారుడు హితేశ్ వైసీపీలో చేరుతామని ప్రకటించారు. అయితే తన భార్య పురందేశ్వరి పార్టీ మారే అవకాశం లేదన్నారు. మె బీజేపీలోనే కొనసాగుతారన్న అయన అవసరమైతే క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటారన్నారు.

జగన్ తో కలిసి పనిచేసేందుకు హితేశ్, తాను సిద్ధంగా ఉన్నామని చెప్పారు . హైదరాబాద్ లో వైసిపి అధినేత జగన్ తో భేటీ అయిన అనంతరం దగ్గుబాటి మీడియాతో మాట్లాడారు. జగన్ ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి వైసీపీని నడుపుతున్నారని కితాబిచ్చారు. ఏపీలో పేదల బాగు కోసం, అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తులు ఎన్టీఆర్, వైఎస్సార్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని అభిమానించేవాళ్లు ఈ పరిణామాన్ని హర్షిస్తారన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై దగ్గుబాటి తీవ్ర విమర్శలు గుప్పించారు.