ఐద‌వ వింతజీవి తోడల్లుడుంటూ వ్యాఖ్యానించిన ద‌గ్గుబాటి

Daggubati Venkateswar Rao
Daggubati Venkateswar Rao

రాజకీయాలంటే గ్లామర్ కాదు.. బాధ్యత అని అభివ‌ర్ణించారు సీనియ‌ర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు. విజయవాడ మీట్ ధి ప్రెస్ కార్యక్రమంలో ఆయ‌న‌ మాట్లాడారు. ఉదయం ఒకమాట.. సాయంత్రం మరో మాట మాట్లాడే స్వభావం సిఎం చంద్ర‌బాబుదంటూ దగ్గుబాటి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భగవంతుని సృష్టి లో నాలుగు రకాల చరాలు ఉంటాయని, అవి నేల మీద, నీళ్లలో, నీటిలో నేలమీద , గాల్లో బతికేవన్నారు.

ఐద‌వ వింత జీవి త‌న తోడల్లుడుంటూ వ్యాఖ్యానించారు ఆయ‌న. సిఎం చంద్రబాబుపై త‌న‌కు అసూయ , ఈర్ష్య లేద‌ని, జాలి మాత్రమే ఉందన్నారు. రోజు సోష‌ల్ మీడియాలో తిట్లు భరిస్తూ ఆ సీట్లో కూర్చోవడం తన వల్ల కాదన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో ఇప్పటి వరకు గ్రాఫిక్స్ చూపించార‌న్నారు ద‌గ్గుబాటి. రాజధాని అకృతులు ఎంపిక చేయడానికి నాలుగేళ్లు కావాలా ? అంటూ నిలదీశారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరికపై సీనియర్‌ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్పష్టత ఇచ్చారు. తాడేపల్లిలో బుధవారం పార్టీ అధినేత వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలోకి చేరనున్నట్లు దగ్గుబాటి వెల్లడించారు. పర్చూరు నియోజకవర్గం నుంచి తన కుమారుడు హితేష్ పోటీ చేస్తాడని ఆయన తెలిపారు.

ఎన్టీఆర్ ఏ ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారో, అదే ఆశయాన్ని తన తల్లిదండ్రులు కూడా కొనసాగించారన్నారు హితేష్. ఎన్టీఆర్ స్పూర్తితో రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నానన్నారు. తమ కుటుంబానికి చెడ్డ పేరు రాకుండా పని చేస్తానని తెలిపారు.