వైసిపి తీర్ధం పుచ్చుకున్న మాజీ మంత్రి దాడి

Dadi Veerabhadra Rao joins YSRCP
Dadi Veerabhadra Rao joins YSRCP

మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైసీపీ అధినేత జగన్ ని ఆయ‌న కలిశారు. ఈ సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంత‌రం వైసీపీలో చేరిన తర్వాత దాడి వీరభద్రరావు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుది డబుల్‌ టంగ్‌ కాదు… మల్టీ టంగ్‌ అన్నారు. తన లోపాలను చంద్రబాబు సరిదిద్దుకోవాలన్నారు. అలాగే జగన్‌లా సుదీర్ఘ పాదయాత్ర చేసినవారెవరూ లేరని, పాదయాత్రతో జగన్‌ ప్రజా సమస్యలు తెలుసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, పార్లమెంటు సభ్యుడు అవంతి శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.