ఐటీ గ్రిడ్స్‌లో ఏం జరుగుతోంది..!

it grids
it grids

ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్‌పై సైబరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు . అంతే కాకుండా ఆయన ఇంటికి లుకౌట్ నోటీసులను పోలీసులు అంటించారు. ఆంద్రప్రదేశ్ ప్రజల సమాచారాన్ని సేకరించారనే కేసులో అశోక్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. మరోవైపు ఐటీ గ్రిడ్‌లో సోదాలు కొనసాగాయి. సైబర్ క్రైమ్ పోలీసులు ఎథికల్ హాకర్స్ సహాయంతో డేటాను బయటకు తీస్తున్నారు.

ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్‌ను చిక్కితేనే దర్యాప్తులో కీలక పురోగతి ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు ఈ డేటాను విశ్లేషించే క్రమంలో అవసరమైతే మరోసారి కూడా ఉద్యోగులకు నోటీసులిచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా సేకరించగా బయటకు వచ్చిన డేటాను జల్లెడ పట్టడానికి ప్రత్యేక బృందాలను రంగంలోని దింపినట్లు వెల్లడించారు పోలీసు అధికారులు.