అఖిల్ సినిమా కి కాస్ట్ కటింగ్

Akkineni Akhil
Akkineni Akhil

ఇప్పటివరకు మూడు సినిమాలు చేసి ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయిన అఖిల్ అక్కినేని కి హిట్ అందించే బాధ్యత అల్లు అరవింద్ కి అప్పగించారు నాగార్జున.అయితే అఖిల్ కోసం బొమ్మరిల్లు భాస్కర్ రెడీ చేసిన ఓక్ స్క్రిప్ట్ ని అఖిల్ సినిమా కోసం ఓకే చేసారు.భాస్కర్ అనే ఒక డైరెక్టర్ ఉన్నాడు అని కూడా అంతా మర్చిపోయిన టైం లో అల్లు అరవింద్ ఆఫర్ ఇచ్చారు.కానీ నాగ్ సందేహించడంతో ఆయనకీ కూడా కథ వినిపించి ఓకే అనిపించుకున్నారు.

అయితే భాస్కర్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇంకో కారణం ఇప్పడు అతనికి అవకాశం ఇస్తే చాలు.వేరే డిమాండ్స్ ఉండవు,ఇచ్చినంత తీసుకుని చెప్పినట్టు పనిచేస్తాడు.అయితే హీరోయిన్ గా మాత్రం కాస్త ఎక్కువయినా కూడా రష్మిక మందన్న ని తీసుకున్నారు.ఎందుకంటే ఎటు అఖిల్ కి క్రేజ్ లేదు.అందుకే అలా కానిచ్చారు.ఇక ముందు ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నారు.కానీ అతని రేటు కోట్లలో ఉందిఆ.అందుకే లక్షల్లోనే అందుబాటులో ఉండే గోపిసుందర్ కి ఈ సినిమా ఇచ్చారు.పైగా ఈ మధ్య మజిలీ ఆల్బమ్ కూడా హిట్ అయ్యింది.అందుకే గోపి మంచి ఆప్షన్ అని అందరిని ఒప్పించి తీసుకున్నారు.

ఇలా అఖిల్ సినిమాని ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ లేకుండా కానిచ్చేస్తున్నారు.అఖిల్ కి కూడా సినిమా హిట్ అయితే తప్ప రెమ్యునరేషన్ అనే మాట ఉండకపోవచ్చు.అయినా అఖిల్ కి కూడా ఇప్పుడు కావాల్సిందల్లా ఒక్క హిట్ మాత్రమే.