వివాదంలో హరీష్ శంకర్ సినిమా

Valmiki Movie
Valmiki Movie

హరీష్ శంకర్ టాలెంట్ ఉన్న డైరెక్టరే.కాకపోతే అతని యాటిట్యూడ్ అప్పుడపుడు పరిధులు దాటుతుంది.అలా DJ టైం లో కూడా మొదటినుండి వివాదాలు చుట్టుముట్టాయి.ఆ సినిమా లోని గుడిలో బడిలో అనే సాంగ్ లో చమకం,నమకం అనే పవిత్రమయిన పదాలు వాడారు.ఒక గ్లామరస్ సాంగ్ కి ఆ పదాలు వాడడంతో వివాదం మొదలయింది.అయినా కూడా ఆ పదాలు తొలగించకుండా నెగెటివ్ పబ్లిసిటీ చేసుకుని ఆ పాట బాగా పాపులర్ చేసుకున్నారు.ఆ తరువాత మళ్ళీ దిల్ రాజు ఆ పదాలను వేరే పదాలతో రీప్లేస్ చేసారు.

హరీష్ కూడా హర్ట్ అయినందుకు సారీ అన్నాడు.అక్కడితో అయిపోలేదు,ఆ సినిమాలోని ఒక సీన్ లో అల్లు అర్జున్ చెప్పులు వేసుకుని గాయత్రి మంత్రం చదువుతాడు.అలాగే కొన్ని చోట్ల డైలాగ్స్ లో కూడా బ్రాహ్మణ యాసతో కాస్త శృతిమించిన డైలాగ్స్ ఉండడంతో మళ్ళీ నిప్పు రాజుకుంది.అంతా కూడా హరీష్ శంకర్ ని కడిగిపారేశారు.అలా ఆ సినిమా అనేక వివాదాలు అలుముకుని ‘మమ ‘ అనిపించుకునే విజయంతో థియేటర్స్ నుండి వెళ్లిపోయింది.ఆ సినిమా టైం లో జరిగిన రచ్చ వల్ల హరీష్ శంకర్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ కి నెక్స్ట్ సినిమా రావడానికి ఇంత టైమ్ పట్టింది.

సాధారణంగా డైరెక్టర్స్ ని వదులుకోని దిల్ రాజు కాంపౌండ్ నుండి కూడా బయటికి వచ్చే పరిస్థితి క్రియేట్ అయ్యింది.లేకలేక, రాకరాక ఒక సినిమా వచ్చింది.కష్టాల్లో ఉన్న 14 రీల్స్ ప్రొడ్యూసర్ ని ఒప్పించుకుని,తనకు బాగా అచొచ్చిన రీమేక్ సెంటిమెంట్ ని నమ్ముకుని జిగర్తాండ స్క్రిప్ట్ ని తెలుగులోకి అనువదించాడు.హిట్స్ తో దూసుకుపోతున్న మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ ఆ సినిమాలో విలన్ గా నటించడానికి ఒప్పుకోవడంతో ఆ సినిమా పై ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది.వాల్మీకి అనే పేరు పెట్టి పూజ కూడా చేసారు.ఆ సినిమా ఇంకా షూట్ కి కూడా వెళ్లకుండానే ఆ టైటిల్ పై వివాదం మొదలయింది.

వాల్మీకి సామాజిక వర్గం వాళ్ళు ఇలాంటి సినిమాకి ఆ టైటిల్ వాడడాన్ని తప్పుబడుతున్నారు.ఇలా చేస్తే వాల్మీకి ని అవమానించినట్టు అవుతుంది అని అంటున్నారు.షూటింగ్ అడ్డుకుంటామని,సినిమాలో కూడా వాల్మీకి అనే పేరు వాడితే ఊరుకోము అని హెచ్చరిస్తున్నారు.ఇప్పటికి మామూలుగా కనిపిస్తున్నా ఈ వివాదం ఎందాక వెళుతుందో చూడాలి.హరీష్ శంకర్ ఎక్కడున్నా వివాదాలు వెదుక్కుంటూ మరీ రావడం మాత్రం విచిత్రంగా ఉంది.