ట్రెండింగ్ గా మారిన వివాదాస్పద సినిమా ట్రైలర్

Anupam-Kher-The-Accidental-Prime-Ministr

ఇండియా కి ప్రైమ్ మినిస్టర్ గా బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్ సింగ్ అందరికి పరిచయమే.అప్పట్లో ఆయన వ్యవహార శైలి,సైలెంట్ గా ఉండడం అనేక విమర్శలు వచ్చాయి.సోనియా చెప్పిందల్లా చేస్తారు అనే టాక్ ఉండేది.అయితే ఆయన ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసిన టైం లో అయన ప్రధాన మంత్రికి సలహాదారుగా ఉన్న సంజయ్ బారు ఒక పుస్తకం రాసారు.దాంట్లో అనేక వివాదస్పదమైన అంశాలు ఉన్నాయి.

ఇప్పుడు అదే పుస్తకం ఆధారంగా యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే సినిమా తీశారు.ఈ సినిమాని ట్రైలర్ లోనే అనేక ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నాయి.అందుకే ఈ సినిమాపై చాలా హైప్ క్రియేట్ అవుతుంది.అది రాజకీయంగా పెనుసంచలనం సృష్టించేలా ఉంది.ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడని మన్మోహన్ సింగ్ ఆత్రగాన్ని ఆవిష్కరిస్తూ కొన్ని డైలాగ్స్ ఉన్నాయి.వాటిపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చెయ్యడంతో ఆ ట్రైలర్ మరింతగా ఫేమస్ అయ్యింది.ఈ సినిమాలో మన్మోహన్ సింగ్ గా బాలీవుడ్ ఆర్టిస్ట్ అనుపమ్ ఖేర్ నటిస్తున్నాడు.

మన్మోహన్ సింగ్ వాకింగ్ స్టైల్ అండ్ మాట్లాడే తీరుని యాస్ ఇట్ ఈజ్ గా ప్రెసెంట్ చెయ్యగలిగారు.యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ కి ఫెవర్ గా ఉండే అవకాశం ఉంది.అందుకే రిలీజ్ కి ముందు సినిమాని ఆయనకి చూపించడానికి ఓకే అంటున్నారు.ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.ఇప్పటికే రిలీజ్ అయిన ఆ సినిమా ట్రైలర్ రాజకీయవర్గాలలోనే కాకుండా అందరిని ఆకర్షిస్తుంది.ఈ సినిమా జనవరి 18 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.