ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీంకు – ఉత్త‌మ్

Uttam Kumar
Uttam Kumar

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నామన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు . ఈసందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ… కొత్తవారే ఓటు వేసే అవకాశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి నోటిఫికేషన్ జారీ చేయడం ఏంటన్నారు ఆయ‌న‌. ఆరు నెలల ముందు ఎన్నికలు నిర్వహించాలన్న నిబంధన ఎక్కడా లేదన్నారు. చనిపోయిన ఎంపీటీసీ,జడ్పీటీసీల పేర్లను జాబితాను తీసివేయలేదని ఉత్తమ్ తెలిపారు. ఎమ్మెల్సీల ఎంపిక డీసీసీ అధ్యక్షులకు అప్పగిస్తూ కాంగ్రెస్ నేతల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.