ఏపిలో కాంగ్రెస్ ప్రజా భరోసా యాత్ర

congress party
congress party

ఒక‌ప్ప‌టి కాంగ్రెస్ పార్టీ కంచుకోట‌పై కాంగ్రెస్ పార్టీ క‌న్నేసింది. ఉనికి కోల్పోయిన ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో పూర్వ వైభ‌వం కోసం ప‌రిత‌పిస్తోంది. అధికారంలోకి వ‌స్తే తొలి సంత‌కం ప్ర‌త్యేక హోదా ఫైల్ పైనే సంత‌కం చేస్తామ‌ని ఆ పార్టీ అధిష్టానం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఇంతేగాక మినిమమ్‌ ఇన్‌కం గ్యారంటీ అనే పథకంతో ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది.

ఈ పథకంతో పేదవాని ఆకలి తీరుతుందన్నది పార్టీ యోచనగా ఉంది. ఈ నేప‌ధ్యంలోనే ఈ నెల 15వ తేదీ నుంచి ప్రజా భరోసా యాత్రకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది.అనంతపురం జిల్లా మడకశిర నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రకు ముఖ్య అతిధులుగా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఏఐసిసి కార్యదర్శి ప్రియాంకగాంధీ హాజరు కానున్నారు.

దీంతో ఏఐసిసీ నాయకులు కూడా ఏపిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. అభ్యర్థులు తాము కోరుకుంటున్న నియోజకవర్గాలకు దరఖాస్తులు చేసుకోవాలని ఏపీసీసీ ఇచ్చిన పిలుపుతో ఇప్ప‌టికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయింది. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంటే ప్రత్యేకహోదా సాధన, డ్వాక్రా సంఘాలకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ, మినిమమ్‌ ఇన్‌కం గ్యారంటీ పథకాల‌తో ఏపిలో ఓట‌ర్ల‌కు వ‌ల వేసేందుకు హ‌స్తం పార్టీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయాల‌ని డిసైడ్ అయింది.