కాంగ్రెస్‌ మేనిఫెస్టో రిలీజ్

Congress Manifesto
Congress Manifesto

సంక్షేమంతో సంపద సృష్టించడమే త‌మ లక్ష్యమన్నారు రాహుల్ . ఉద్యోగ కల్పన, రైతు సమస్యలే ప్రధాన అజెండా అని స్ప‌ష్టం చేశారు ఆయ‌న‌. హ‌స్తిన‌లో హమ్‌ నిభాయేంగే పేరుతో కాంగ్రెస్‌ మేనిఫెస్టోను పార్టీ సీనియర్‌ నేతల సమక్షంలో విడుదల చేశారు. తమ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉందన్నారు రాహుల్ . మేనిఫెస్టోలో ఐదు ప్రధాన అంశాలు రూపొందించారు. పేదరికంపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తామన్నారు. పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందిస్తామని మేనిఫెస్టోలో వివ‌రించారు రాహుల్ . అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను పునరుద్ధరిస్తామని, వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి నిధుల్ని పెంచుతామని రాహుల్‌ మేనిఫెస్టోలో వెల్ల‌డించారు.

పేదలకు కనీస ఆదాయ హామీ పధకం
నిరుపేద కుటుంబాలకు ఏటా రూ 72వేల ఆర్ధిక సాయం
ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ
ఉపాధి హామీ పధకం 100 రోజుల నుంచి 150 రోజులకు విస్తరణ
విద్యారంగానికి బడ్జెట్‌లో ఆరు శాతం నిధులు
ప్రభుత్వ వైద్య సేవల విస్తరణ
యువతకు మూడేళ్లపాటు అనుమతులు లేకుండా వ్యాపారం చేసుకునే వెసులుబాటు
ప్రత్యేకంగా కిసాన్‌ బడ్జెట్‌