తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు ఊహించ‌ని షాక్

Congress leader DK Aruna joins BJP in the presence of Amit Shah and Ram Madhav.
Congress leader DK Aruna joins BJP in the presence of Amit Shah and Ram Madhav.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వ‌రుస‌గా షాక్ లు మీద షాక్ లు త‌గులుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో బీజేపీ చీఫ్ అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాలను కీల‌క పాత్ర పోషించిన ఆమె ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్‌ను వీడడం ఆ పార్టీకి పెద్ద ఎద‌రుదెబ్బ‌గా మారింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ చొరవతో ఆమె క‌మ‌ల ద‌ళంలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన అరుణ టీఆర్ఎస్ చేతిలో ఓటమి పాలయ్యారు.

అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆమె మహబూబ్‌నగర్ నుంచి లోక్‌సభకు బిజేపి త‌ర‌పున పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మరోమారు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని డీకే అరుణ అన్నారు. టీఆర్‌ఎస్‌కు రెండోమారు అధికారం దక్కటానికి చాలా కారణాలున్నాయన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.