డేటా వివాదంలో ఏపి సిఎంపై ఫిర్యాదు

AP CM Chandra Babu Naidu
AP CM Chandra Babu Naidu

ఐటీ గ్రిడ్స్ కంపెనీ డేటా చోరీ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపుతోంది. తాజాగా ఈ వివాదానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబుపై ఎస్‌ఆర్‌నగర్ పీఎస్‌లో టీఆర్ఎస్ నేత దినేష్‌చౌదరి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని చంద్రబాబు తీవ్రవాదులతో పోల్చారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారన్నారు.

తెలంగాణ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా మాట్లాడిన చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని ఆయ‌న కోరారు. ఇటు హైదరాబాద్ లోని ఐటీ గ్రిడ్ ఆఫీసులో సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ గ్రిడ్ నుండి కీలక సమాచారం లభించడంతో… ఆ డేటాను మరో బృందం విశ్లేషిస్తోంది.

ఐటీ గ్రిడ్ డేటాలో తెలంగాణ వ్యక్తుల సమాచారం ఉండడంతో అధికారుల మ‌రింత అలెర్ట్ అయ్యారు. ఆ డేటాలో ఉన్న వ్యక్తులను గుర్తించి, విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఐటీ గ్రిడ్స్ కంపెనీ య‌జ‌మాని అశోక్ ను పట్టుకునేందుకు మూడు బృందాలు రంగంలోకి దిగాయి. ఐటీ గ్రిడ్ ఉద్యోగులకు మరోసారి సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు స‌మాచారం.