ధ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీకి వైసిపి ప్ర‌మోష‌న్

YCP
YCP

ధ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ.. ఈ డైలాగ్ వింటేనే ఆయ‌నెవ‌రో మీకు తెలిసిపోతుంది. ఆ అనుభ‌వం రాజ‌కీయాల్లో కాక‌పోయినా ప్ర‌మోష‌న్ కొట్టేశారు.ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్ . వైసిపి లో ఆయ‌నను కీలక పదవి వ‌రించింది. వైసీపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా పృథ్వీరాజ్ ని నియమించారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయం ఈ నియాయ‌కంపై ప్రకటన విడుదల చేసింది. ఆంద్ర‌ప్ర‌దేశ్ లో వైసీపీ నిర్వహించిన ప‌లు కార్యక్రమాల్లో చాలా యాక్టివ్‌గా పృథ్వీరాజ్ త‌న భాగ‌స్వామ్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంటారు.

ఇటీవల జగన్ పాదయాత్రలో కూడా ఆయ‌న పాల్గొన్నారు. దీంతో పాటు సోష‌ల్ మీడియాలో కెమెడియ‌న్ పృథ్వీరాజ్ త‌న‌దైన స్టైల్‌లో స్పందిస్తుంటారు. ప్రజా సమస్యలను ప్రస్తావించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండ‌గ‌డ‌తాన‌న్నారు పృథ్వీరాజ్.
ఎన్నిక‌ల వేళ పార్టీ త‌న‌కిచ్చిన ఈ బాధ్య‌త‌ల‌ను స‌ద్వినియోగం చేసుకుంటాన‌ని వెల్ల‌డించారు.