మహేష్ హీరోగా ‘నేను నా నాగార్జున’…!

Nenu Na Nagarjuna
Nenu Na Nagarjuna

జబర్దస్త్ ప్రొగ్రామ్ ద్వారా పరిచయం అయ్యాడు కమెడియన్ మహేశ్ ఆచంట.అనంతరం రామ్ చరణ్,సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం వంటి హిట్ సినిమాలలో తన నటనతో పాపులర్ అయ్యాడు మహేష్. అయితే తాజాగా మహేశ్ హీరోగా మారి ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్‌ ‘నేను నా నాగార్జున’.

తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు ఆర్బి గోపాల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను నాగేశ్వరరావు నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో మహేష్ నాగార్జున అభిమానిగా నటిస్తునట్లు తెలుస్తుంది.