జలవనరుల శాఖపై జగన్ మోహన్ రెడ్డి సమీక్ష

Jaganmohan Reddy, Prakasham, Tirupathi, YSRCP,
YS Jagan Mohan Reddy

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శాఖల వారీగా సమీక్ష చేస్తున్నారు జగన్‌ మోహన్ రెడ్డి. తాజాగా జలవనరుల శాఖ అధికారులతో రెండోసారి సమావేశమయ్యారు. తాడేపల్లిలోని తన నివాసంలో నిర్వహిస్తున్న సమీక్షకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, మాజీ కార్యదర్శి శశిభూషణ్‌, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రాజెక్టుల వారీగా సీఎం సమీక్షిస్తున్నారు. ఈ నెల 3వ తేదీన నిర్వహించిన సమావేశంలో కేవలం పోలవరం ప్రాజెక్టు, దానికి సంబంధించిన అంశాలపై మాత్రమే చర్చించారు. తాజాగా రెండోసారి నిర్వహిస్తున్న సమీక్షలో రాష్ట్రంలోని ప్రాజెక్టులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి. అవి పూర్తి కావడానికి ఎంతెంత నిధులు అవసరమనే విషయాలపై అధికారులను జగన్‌ అడిగి తెలుసుకుంటున్నారు.