ఎన్నిక‌ల వేళ చంద్ర‌బాబు నిర‌స‌న దీక్ష‌..!

Chandrababu Naidu
Chandrababu Naidu

కేంద్రం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విమ‌ర్శించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆయ‌న నిరసన దీక్షలో పాల్గొన్నారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న అంబేద్కర్‌ విగ్రహాల వద్ద టిడిపి నేతలు, కార్యకర్తలు నిరసన దీక్షల‌కు హాజ‌ర‌య్యారు. ఐటీ దాడులకు నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి చంద్రబాబు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ విభజన చట్ట హామీలు నెరవేర్చకుండా ఎదురుదాడి చేస్తున్నారన్నారు. ప్రధాని మోడీ రాక్షస పాలనకు శ్రీకారం చుట్టారన్నారు. చాలా దుర్మార్గంగా వైసీపీతో కలిసి దాడులు చేపిస్తున్నారన్నారు. జగన్ హైదరాబాద్ లో కూర్చొని కుట్రలు, కుతంత్రాలు చేశారన్నారు.