తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు అభ్య‌ర్ధులు ఖ‌రారు

Telangana CM KCR
Telangana CM KCR

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఖరారయ్యారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్‌ ప్రకటించింది. టీపీసీసీ ప్రతిపాదించిన ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఏఐసీసీ తన ఆమోదాన్ని తెలిపింది. రంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉదయ మోహన్ రెడ్డి, నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోమటిరెడ్డి లక్ష్మీరెడ్డి, వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇనుముల వెంకట్రామిరెడ్డిని టీపీసీసీ ఖరారు చేయగా ఏఐసీసీ వాటిని ఆమోదించింది. మ‌రోవైపు ఇప్ప‌టికే టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. వరంగల్‌ స్థానానికి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి స్థానానికి పట్నం మహేందర్‌రెడ్డి, నల్లగొండ స్థానానికి తేరా చిన్నపరెడ్డిలను అభ్యర్థులుగా ఎంపిక చేశారు. వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు మంగళవారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది.