అద్భుత పుణ్యక్షేత్రంగా యాదాద్రి – సిఎం కేసీఆర్

KCR
KCR

యాదాద్రిలో వెయ్యి ఎకరాల్లో టెంపుల్ సిటీ నిర్మిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణ పనులను ఆయ‌న పరిశీలించారు. యాదాద్రిని అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. సనాతన ఆలయంగా యాదాద్రికి విశ్వవ్యాప్తంగా ఖ్యాతి ఉందన్నారు. 250 ఎకరాల్లో 350 క్వార్టర్ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఏడంతస్తుల గోపురం కూడా శిల్పాలతోనే కట్టామని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ సిఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలోనే యూనిక్ టెంపుల్ యాదాద్రి గా ఆయ‌న అభివ‌ర్ణించారు. యాదాద్రికి త్వరలోనే మళ్లీ చినజీయర్ స్వామితో కలిసి వస్తానన్నారు సిఎం.మొత్తం 1100 ఎకరాల్లో టెంపుల్ సిటీ నిర్మిస్తున్నామన్నారు. క్వార్టర్స్ కట్టేందుకు 43మంది దాతలు ముందుకొచ్చారన్నారు. అభివృద్ది పనుల కోసం మరో 70 ఎకరాలు మంజూరు చేస్తున్నామన్నారు .

గండిచెరువుకు కాళేశ్వరం నుంచి నిధులు ఇస్తామన్నారు. నిత్యాన్నదానం కోసం దాతలు ముందుకు వస్తున్నారన్నారు. ఆలయం లోపల పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. గండిచెరువులో స్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తామన్నారు. ఆగమశాస్త్రం ప్రకారమే ఆలయ నిర్మాణం సాగుతోందని, పనులలో ఇంకా వేగం పెంచాలని అధికారులకు ఆదేశించారు. పనులు నిర్మాణం పూర్తయ్యాక మంచి ముహూర్తంలో యాదాద్రి ప్రారంభోత్సవం జరగనుందని, ఈ పారంభానికి నూట ముప్పై మూడు దేశాల నుండి పండితులు రానున్నారని చెప్పారు.