ప్ర‌ధాని మోదీకి సిఎం చంద్ర‌బాబు లేఖ…!

chandrababu,modi

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సిఎం చంద్రబాబు లేఖ రాశారు.జగన్‌ కేసును ఎన్ ఐ ఏ కి అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మోదీకి బాబు లేఖ రాశారు.కోడి కత్తి కేసు ఎన్ ఐ ఏ పరిధిలోకి ఎలా వస్తుందని నిలదీశారు.ఫెడరల్‌ స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని చంద్రబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.గతంలో గుజరాత్ సిఎంగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయ‌న ప్రస్తావించారు.టెర్రరిస్టుల చర్యలు అదుపులోకి పెట్టేందుకు జాతీయ భద్రతా సంస్థను ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్న కేంద్రం, రాష్ట్రాల హక్కులను హరించివేస్తోందని మోదీ చేసిన వ్యాఖ్యలను లేఖలో బాబు ప్ర‌స్తావించారు.