తిరుప‌తిలో బాబు ప్ర‌చార భేరికి శ్రీకారం

tdp
tdp

గెలుపు గుర్రాలను రంగంలోకి దింపామన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు . తిరుపతిలో ఆయ‌న ప్రచార భేరిని ప్రారంభించారు. టీడీపీ తొలి జాబితా పట్ల 90 శాతం మంది కార్యకర్తలు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఒకే ఆలోచనతో ఉండాలన్నారు .

అభ్యర్థుల ఎంపిక చాలా పకడ్బందీగా చేస్తున్నామని వివ‌రించారు దీనికి ముందు తెలుగుదేశం అధినేత చంద్రబాబు దంపతులు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం దంపతులతో పాటు మంత్రి లోకేశ్ దంపతులు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.