కేడ‌ర్ వుంది.. డోంట్ కేర్ – టిడిపి అధినేత చంద్ర‌బాబు

TDP, Jagan, YSR, YSRPARTY,
Chandra Babu

తాజా వ‌ల‌స‌లు తెలుగుదేశం పార్టీకి త‌ల‌నొప్పిగా మారింది. ఎన్నిక‌ల వేళ ఇది ఆ పార్టీకి ఊహించ‌న ప‌రిణామ‌మే అయినా పార్టీ కేడ‌ర్ చేజారిపోకుండా నివార‌ణ చ‌ర్య‌లు తీసుకొంటుంది. మొన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, నిన్న‌ అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరారు. పార్టీని వీడే నాయకులను చూసి తాను భయపడనని.. పోతేపోనీ ఎవరు వీడినా పార్టీకి వచ్చిన నష్టం లేదన్నారు తెలుగుదేవ పార్టీ అధినేత చంత్ర‌బాబు.

ఐదేళ్లు టీడీపీ తరపున ఎంపీ, ఎమ్మెల్యేలుగా పనిచేసి తనతో అన్ని పనులు చేయించుకున్నారన్నారు. వ‌ల‌స‌ల‌కు దిగిన వాళ్లు ఎలాంటి వ్యక్తులో అర్థం చేసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చూసి ప్రతిపక్షానికి వణుకుపుట్టి ఇలా నేతలకు వల వేస్తున్నారన్నారు. అయినా త‌మ‌కు పార్టీ కార్య‌క‌ర్త‌లు ఎల్ల‌ప్పుడూ అండ‌గా వుంటార‌న్నారు ఆయ‌న‌.