కియో కార్ల త‌యారీకి కేరాఫ్ ఆంద్రా

AP CM Chandra Babu Naidu
AP CM Chandra Babu Naidu

కియా బాటలో మరిన్ని కంపెనీలు ఏపీకి రాబోతున్నాయన్నారు ఏపి సీఎం చంద్రబాబు . అధునాతన ఎస్‌పీ కాన్సెప్ట్‌ ఎస్‌యూవీ మోడల్‌ కారును ఆయన ఆవిష్కరించారు . అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామం వద్ద ‘కియా మోటార్స్ ఇండియా’ కంపెనీ ప్లాంట్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ….కియా కార్లకు భారత్ అతి పెద్ద మార్కెట్ కాబోతోందన్నారు. కొరియా నుంచి మరిన్ని సంస్థలను ఏపీకి తేవాలన్నారు.

సౌత్ కొరియాలో ఏపీ అంబాసిడర్ గా కియా మోటార్స్ ఉందన్నారు. 2017లో నిర్మాణం ప్రారంభించి ట్రయల్ ప్రొడక్షన్ స్థాయికి చేరుకుందన్నారు. దక్షిణ కొరియా ఏపీకి ఎన్నో సారూప్యతలున్నాయన్నారు. కొరియా, ఏపీ ప్రజలు ప్రపంచంలో ఎక్కడైనా నెగ్గుకు రాగలరన్నారు. కియా పెట్టుబడులతో ఈ ప్రాంతం ఆటో మొబైల్ పారిశ్రామిక హబ్ గా మారుతుందన్నారు. బిలియన్ డాలర్లు వెచ్చించి నిర్మించిన ఈ ప్లాంట్ కు ఏడాదికి 3 లక్షల యూనిట్ల వాహనాల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంద‌న్నారు.