ఏపి సిఎం సంక్రాంతి కానుక భారం ఎంతో..!

Chandra-Babu
Chandra-Babu

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం ఎన్నికల వేళ‌ సంక్రాంతికి ముందు పండగ కానుకను ప్రకటించింది. నెల్లూరు జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న పెన్షన్లను రెట్టింపు చేస్తున్నామని సంక్రాంతి కానుక‌ను అందించారు. పెంచిన పెన్షన్లు ఈ జనవరి నుండే అందించనున్నామని సీఎం ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెన్షన్ల చెల్లింపు కోసం 550 కోట్లను ఖర్చు చేస్తుంది. పెరిగిన పెన్షన్లతో మొత్తం 1100 కోట్లను చెల్లించాలి.ఇక వీటితో పాటు మొత్తం 11రోజుల జన్మభూమి కార్యక్రమంలో ఆరున్నర లక్షల పెన్షన్ దరఖాస్తులు అందాయి.

వీటిలో సుమారు నాలుగు లక్షల పెన్షన్లను వచ్చే నెల నుండి చెల్లించనున్నారు. అంటే దాదాపు నెలకు రెండు వేల కోట్ల రూపాయల పెన్షన్లను ఫిబ్రవరి నెల నుండి ఏపీ ప్రభుత్వం చెల్లించనుంది. 2014 కు ముందు పెన్షన్ అంటే కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే చెల్లించారు. అయితే చంద్రబాబు ఎన్నికల హామీ ఇవ్వడం వెయ్యి రూపాయలకు పెంచగా,ఇప్పుడు ఎన్నికలకు ముందే పండుగ కానుకగా రెట్టింపు చేశారు. ఇది ఆంద్ర‌ప్ర‌దేశ్ ఖ‌జానాపై భారీగా భారం ప‌డ‌నుంద‌న‌డంలో ఏ మాత్రం సందేహం లేదు.