చిత్రలహరి:పక్కా ఎంటర్టైనర్

ChitraLahari Movie
ChitraLahari Movie

చిత్రలహరి…పాత కాలంలోసూపర్ హిట్ అయిన పాటల ప్రోగ్రాం.ఇక ఇప్పడు వస్తున్న చిత్రలహరి హిట్ కాబోతున్న సినిమా.ఈ సినిమా రిలీజ్ కాకుండానే హిట్ అనెయ్యడం తప్పుకాదేమో అనిపిస్తుంది.ఈ సినిమా టీజర్ సూపర్,సాంగ్స్ రాక్స్,ట్రైలర్ హిలేరియస్…మరి ఒక సినిమాలో కంటెంట్ ని జడ్జ్ చెయ్యడానికి ఇంతకుమించిన కొలమానాలు అక్కర్లేదు.ఈ సినిమా ట్రైలర్ అయితే సినిమాపై ఎవరికయినా కొద్దిపాటి అనుమానాలయినా ఉంటే వాటిని కూడా పూర్తిగా తుడిచిపెట్టేసింది.ప్రేక్షకులకు కావాల్సిన ఫన్,హత్తుకునే లవ్ స్టోరీ,కనెక్ట్ చేసే ఎమోషన్…ఇలా అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయి అని ఈ సినిమా ట్రైలర్ ప్రూవ్ చేసింది.ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ లుక్ కూడా చాలా కొత్తగా ఉంది.

పైగా అది అతని క్యారెక్టర్ కి కూడా కనెక్టింగ్ గా ఉండడం ఇంకా బావుంది.ఇక కళ్యాణి ప్రియదర్శిని,నివేత పేతురాజ్ లకు కూడా సమానమయిన వెయిట్ ఉన్న పాత్రలు దక్కాయి.ఇక ఈ సంవత్సరం ఇప్పటివరకు ఒక్క సరైన హిట్ కూడా దక్కించుకోలేకపోయిన DSP కి ఈ సినిమాకి మాత్రం అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడు.మైత్రి మూవీ మేకర్స్ స్థాయికి తగ్గట్టు నిర్మాణవిలువలు కూడా ఉన్నాయి.ఇక ఇంతకుముందే నేను శైలజ సినిమాతో తన టాలెంట్ ఏంటి అనేది చూపించిన కిషోర్ తిరుమల ఈ సినిమాని చాలా కాన్ఫిడెంట్ గా తెరకెక్కిస్తున్నాడు.మరి రిలీజ్ కి ముందే ఇంత పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకున్న చిత్రలహరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది అన్నది ఈ శుక్రవారం తేలిపోతుంది.