చిత్రలహరి టీజర్ రివ్యూ : ఫుల్ ఎంటర్టైన్మెంట్

Chitralahari
Chitralahari

చిత్రలహరి…ఈ ప్రోగ్రాం దూరదర్శన్ టైం లో ఎంత పాపులర్ అనేది అప్పటి ప్రేక్షకులకి బాగా తెలుసు.అదే పాయింట్ ని ఎక్స్ ప్లైన్ చేస్తూ సుకుమార్ వాయిస్ ఓవర్ లో ఈ సినిమా టీజర్ స్టార్ట్ అవుతుంది.ఈ సినిమాలో నాలుగు పాత్రల చుట్టూ తిరిగే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మూవీ అని టీజర్ తోనే క్లారిటీ ఇచ్చేసాడు డైరెక్టర్ కిషోర్ తిరుమల.

అయితే ఈ సినిమాలో ఒక హీరోయిన్ నివేత మెన్ హేటర్ గా కనిపిస్తే,మరొక హీరోయిన్ కళ్యాణి కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్న అమ్మాయిగా నటించింది.ఇక సునీల్ ఈ సినిమాతో తన పూర్వపు ఫామ్ ని అందుకున్నట్టే కనిపిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అందరికంటే హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ కి చాలా కీలకం.

ఇప్పటికే వరుసగా ఆరుపరాజయాల భారాన్ని మోస్తునం తేజు ఈ సినిమాలో సరికొత్త మేకోవర్ తో కనిపించాడు.పైగా ఈ సినిమాలో అతని పేరు విజయ్ అని చెప్పించి సెల్ఫ్ కౌంటర్స్ వేయించి సినిమాపై ఇంట్రెస్ట్ జనరేట్ చేసాడు డైరెక్టర్.చిత్రలహరి లో పొరపాటున కూడా యాక్షన్ జోలికి పోలేదు తేజు.తనలోని కామెడీ యాంగిల్ ని ప్రేక్షకులకి పరిచయం చెయ్యడం పైనే దృష్టి పెట్టాడు.

వెన్నెల కిషోర్,సుదర్శన్ లాంటి కంటెంట్ ఉన్న కమెడియన్స్ కూడా రెచ్చిపోయి మరీ పంచెస్ వేసినట్టు కనిపిస్తుంది.కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ,దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ వల్ల సినిమా టెక్నీకల్ గా కూడా హై రేంజ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది.నాని రిజెక్ట్ చేసిన ఈ స్టోరీ సాయి ధరమ్ తేజ్ ఫ్లాపుల పరంపరకు అడ్డుకట్ట వేసేలా ఉంది.

చిత్రలహరి టీజర్