చిత్రలహరి…హౌస్ ఫుల్స్

Chitralahari
Chitralahari

ఆరు ఫ్లాపుల తరువాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి గత శుక్రవారం రిలీజ్ అయ్యింది.యునానిమస్ గా హిట్ టాక్ తెచ్చుకోకపోయినా పర్లేదు అని అనిపించుకుంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా డీసెంట్ వసూళ్లతోనే రన్ అవుతుంది.రెండు రోజులకు గాను అయిదున్నర కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టిన ఈ సినిమా ఆదివారం కూడా కూడా చాలా చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడిచింది.

మొదటి వీకెండ్ లోనే 10 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన చిత్రలహరి ఓవర్ ఆల్ థియేట్రికల్ వేల్యూ 15 కోట్లకు లోపే ఉంది కాబట్టి అది రికవర్ చెయ్యడమే కాదు కాస్తో కూస్తో లాభాలు అందించడం కూడా ఖాయమే. కానీ ఆ లాభాల ఫిగర్ అనేది మాత్రం ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న సినిమాల ఫలితం పై ఆధారపడి ఉంది.ఏది ఏమైనా తేజు పరాజయాల పరంపరకు చిత్రలహరి బ్రేక్ వేసింది అనేది నిజం.