బన్నీ సినిమాకి చిరు బ్రేక్

chiranjeevi-allu arjun
chiranjeevi-allu arjun

ఒకప్పుడు వరుసవిజయలతో సాగిపోయిన బన్నీ కెరీర్ కి గట్టి బ్రేక్స్ వేసింది నా పేరు సూర్య సినిమా.ఆ షాక్ నుండి కోలుకుని త్రివిక్రమ్ తో సినిమా ఓకే చేసాడు.పైగా త్రివిక్రమ్ సినిమా అయినా కూడా మొత్తం స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యేవరకు సెట్స్ కి వెళ్ళకూడదు అని ఫిక్స్ అయ్యాడు.త్రివిక్రమ్ కూడా మొత్తం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి బన్నీ కి ఫుల్ లెంగ్త్ నెర్రేషన్ కూడా ఇచ్చాడు.దీంతో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే టైం వచ్చేసింది.ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది.

హీరోయిన్ ఫిక్స్ అయితే ఇక షూటింగ్ షురూ అయినట్టే.బన్నీ,త్రివిక్రమ్ ల కాంబో లో ఇది మూడో సినిమా కావడం,ఇంతకుమును వచ్చిన రెండు సినిమాలు కూడా సూపర్ హిట్స్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.అయితే త్రివిక్రమ్ చిన్న చిన్న సెంటిమెంట్స్ కూడా పక్కాగా ఫాలో అవుతుంటాడు.గత ఏడాది సంక్రాంతి వచ్చిన అజ్ఞాతవాసి ఫ్లాప్ అయ్యింది.కానీ దసరాకి వచ్చిన అరవింద సమేత హిట్ అయ్యి త్రివిక్రమ్ ఈజ్ బ్యాక్ అనిపించింది.

అందుకే బన్నీ తో మొదలు పెడుతున్న సినిమాను కూడా దసరాకి రెడీ చెయ్యాలి అని ముందే అనుకున్నారు.బయటికి చెప్పకపోయినా ఇంటర్నల్ అదే రిలీజ్ డేట్ అని ఫిక్స్ అయ్యారు.నిజానికి ఆ టైం లో షెడ్యూల్ అయిన పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో డేట్ గురించి పెద్ద డిస్కషన్స్ కూడా ఏమీ లేవు.అంతా 2020 సంక్రాంతి రిలీజ్ అనుకున్న సైరా అనుకోకుండా 2019 దసరాకి వస్తుంది అని ఆ సినిమా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ తేల్చి చేప్పేసాడు.

ఆ సినిమాలో ఇంకో 50 రోజుల షూటింగ్ పార్ట్ మాత్రమే బాలన్స్ ఉంది.ఆ షూటింగ్ పూర్తయిపోయాక ఆరునెలలు టైం ఉండడంతో సైరా దసరాకి రావడం ఖాయం.దాంతో బన్నీ సినిమా ఖచ్చితంగా ఆపుకోవాలి.పెద్ద సినిమా కాబట్టి 2020 సంక్రాంతికి రావాలి.కానీ త్రివిక్రమ్ నెగెటివ్ సెంటిమెంట్ ని ఎంకరేజ్ చెయ్యడు.దీంతో లాంగ్ గ్యాప్ తరువాత సినిమా మొదలుపెడుతున్న బన్నీ ఆనందాన్ని ఎప్పుడు రిలీజ్ చెయ్యాలి అన్న కన్ఫ్యూషన్ డామినేట్ చేస్తుంది అంటున్నారు.