రిలీజ్ కి సై అంటున్న సైరా

Syeraa Narsimha Reddy
Syeraa Narsimha Reddy

సైరా…టాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీస్ కూడా ఈ సినిమా గురించి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.కానీ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది.సస్పెన్స్ అనేకంటే కన్ఫ్యూషన్ అంటే కరెక్ట్ గా ఉంటుంది.రీసెంట్ గా ఈ సినిమా సెట్ కాలిపోవడంతో సైరా వచ్చేది సంక్రాంతికే అని ఫిక్స్ అయిపోయారు అంతా.కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ వచ్చింది.పైకి అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యకపోయినా ఇంటర్నల్ గా మాత్రం ఒక డేట్ కి ఫిక్స్ అయ్యారుఆ.అయితే అంతా అనుకుంటున్నట్టు దసరా కాకుండా ఇంకా ముందే సైరా ని థియేటర్స్ కి దింపేస్తున్నారు.

సంక్రాంతిని టార్గెట్ చేసుకుని చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి.వాటిని పోస్ట్ ఫోన్ చేయించడం జరగని పని.రెండు మూడు రోజుల గ్యాప్ లో రిలీజ్ అయితే సేఫ్ అనుకోవడానికి ఇది 200 కోట్ల భారీ బడ్జెట్ మూవీ.అందుకే దసరాకి వారం ముందు ,అంటే అక్టోబర్ 2 నే సినిమా రిలీజ్ అవుతుంది.పేట్రియాటిక్ అప్పీల్ ఉన్న సినిమా కావడంతో గాంధీ జయంతి కూడా కావడంతో సినిమా థీమ్ కి రిలేట్ అవుతుంది.ఫైర్ యాక్సిండెంట్ తో పోస్ట్ పోనే అవుతుంది అనుకున్న సినిమా ప్రీ ఫోన్ అవుతుంది అన్న న్యూస్ మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపుతుంది.