విద్యా రంగంలోకి మెగా స్టార్ చిరంజీవి…!

Mega Star Chiranjeevi
Mega Star Chiranjeevi

టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి విద్య రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. విద్యావేత్తగా మారబోతున్నారని, అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి మెగా ఫ్యామిలీ చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్‌ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా నుండి ఇందుకు శ్రీకారం చుట్టానున్నట్లు తెలుస్తుంది. చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో అధునాతన సౌకర్యాలు, ఏసీ వసతులతో క్యాంపస్‌లను ఏర్పాటు చేస్తున్నామని సీఈఓ జే శ్రీనివాసరావు ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యార్థులకు హైటెక్ శిక్షణ ఇచ్చేందుకు ప్రప్రథమంగా శ్రీకాకుళం నగర శివార్లలోని పెద్దపాడు రోడ్డులో మొదటి చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్‌ను అన్ని సదుపాయాలతో నెలకొల్పుతున్నట్టు చెప్పారు. జూన్ మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్టు తెలియజేశారు. నర్సరీ నుంచి గ్రేడ్ 5 వరకు ఐజిసిఎస్ఈ, సీబీఎస్ఈలలో తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఏసీ క్లాస్ రూమ్ లు, ఆడియో విజువల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్, సీసీటీవీల ద్వారా పర్యవేక్షణ, పేరెంట్టీచర్ ముఖాముఖి, ఇంగ్లిష్ గ్రామర్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రత్యేకతలని వివరించారు.