సైరా పై ఎప్పుడూ అదే కామెడీ

Syeraa Narsimha Reddy
Syeraa Narsimha Reddy

సైరా…బాహుబలి తరువాత మళ్ళీ అంత భారీ బడ్జెట్ తో,పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది.మెగా స్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న సినిమా కావడంతో సాధారణంగానే భారీ హైప్ ఉంటుంది.గ్రాఫిక్స్ అవసరం ఎక్కువగా ఉండడంతో సినిమాకి టైం ఎక్కువే పడుతుంది.పైగా సింగిల్ లొకేషన్ కాదు,మల్టిపుల్ లొకేషన్స్ లో షూట్ చెయ్యాలి.అందుకే షూటింగ్ చేసే టైం కంటే షిఫ్టింగ్ టైం ఎక్కువతీసుకుంటుంది.అది సహజమే.

అయితే దీని బేస్ చేసుకుని చాలామంది సైరా పై ఎప్పటికప్పడు ఒక కామన్ ఆర్టికల్ నే పబ్లిష్ చేస్తున్నారు.అదేంటంటే సినిమా షూటింగ్ లేట్ అవుతుంది,డైరెక్టర్ సురేందర్ రెడ్డి కి చిరంజీవి క్లాస్ పీకాడు అని.సినిమా షూటింగ్ కూడా ఆల్మోస్ట్ ఎండింగ్ కి వచ్చేసింది.అయితే ఈ టైం లో కూడా ఇదే తరహా వార్తలు రావడం విచిత్రం.నాలుగురోజుల్లో షూటింగ్ ఫినిష్ అవుతుంది.ఆ షూటింగ్ లో మెయిన్ ఆర్టిస్టుల కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి లేట్ అవుతుంది.

దీంతో మళ్ళీ షూటింగ్ ఆగిపోవడంతో సురేందర్ రెడ్డి పై చిరు ఫైర్ అంటూ బోల్డ్ లెటర్స్ కనిపిస్తున్నాయి.దీంతో అసలు విషయం పై క్లారిటీ ఉన్న కామన్ ఆడియన్స్ సైతం నవ్వుకుంటున్నారు.షూటింగ్ పూర్తయిపోతున్నా కూడా సినిమా దసరా కి రావడం అనేది మాత్రం అనుమానమే అనేది మాత్రం యూనిట్ మాట.

ఎందుకంటే సినిమా అవుట్ ఫుట్ గ్రాఫిక్స్ తో ముడిపడి ఉన్నప్పుడు అది ఏ టైం కి థియేటర్స్ లోకి వస్తుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు.బాహుబలి నుండి 2.0 వరకు చాలా ఉదాహరణలే ఉన్నాయి.2020 సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.సైరా పై ఆ కామెడీస్ కి ఇక ఫుల్ స్టాప్ పెట్టడం బెటర్.