కేబినెట్ విస్తరణ స్పీకర్ నియామకంతో ముడి

KCR
KCR

స్పీక‌ర్  ఎన్నిక త‌ర్వాతే కేబినెట్  కూర్పు చేయాలని తెలంగాణ  సిఎం కేసీఆర్  డిసైడ్ అయిన‌ట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం మంత్రివర్గంలో సీఎం కేసీఆర్‌తో పాటు మహమూద్‌ అలీ ఒక్క‌రే  ఉన్నారు.  తొలి కేబినెట్ విస్త‌ర‌ణ‌లో సిఎం 8 మందికి చోటు కల్పిస్తారని స‌మాచారం.  రెండో విడ‌త‌లో మరో ఎనిమిది మందిని తీసుకుంటారని తెలుస్తోంది.

ఈ మేరకు లిస్ట్  కూడా రెడీ అయిన‌ట్లు చెబుతున్నారు.  కేటీఆర్‌, హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి లేదా /పద్మాదేవేందర్‌రెడ్డి,  పోచారం శ్రీనివాస్‌రెడ్డి లేదా ప్రశాంత్‌రెడ్డి,  ఈటల రాజేందర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, కడియం శ్రీహరి, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వినయ్‌భాస్కర్ లేదా జోగురామన్న, జగదీశ్‌రెడ్డి లేదా గుత్తా సుఖేందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి లేదా /పువ్వాడ అజయ్‌, నిరంజన్‌రెడ్డి లేదా లక్ష్మారెడ్డి,  రెడ్యానాయక్ లేదా రేఖానాయక్‌లు జిల్లాల వారీగా ఈ జాబితాలో ఉన్నార‌ని తెలిసింది. ఒక వేళ  స్పీక‌ర్ ప‌ద‌వి   పోచారంని   వ‌రిస్తే …ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి ప్రశాంత్‌రెడ్డికి అవకాశం వస్తుంది. మ‌రోవైపు  పద్మా దేవేందర్‌రెడ్డికి అవకాశం వస్తే,  సామాజికవర్గంతో పాటు మహిళా కోటాగా పరిగణించ‌నున్నారు. ఇక   రేఖానాయక్‌ను ఎంపిక చేస్లే….  ఆమెను మహిళా కోటాతో పాటు ఎస్టీ కోటా కింద చూస్తారు.

ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు ఎవరైనా వస్తే కేబినెట్ కూర్పులో మార్పులు ఉండే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాల పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా కోటా నుంచి మాత్రం విధిగా ఒకరుండే అవకాశముంది. అయితే స్పీక‌ర్ ప‌ద‌విని చేప‌ట్టేందుకు నేత‌లు అంత‌గా ఆస‌క్తి చూప‌డం లేదు. గ‌తంలో స్పీక‌ర్ ప‌నిచేసిన వారికి భ‌విష్య‌త్ లో రాజ‌కీయ అంధ‌కారం ఏర్ప‌డ‌టంలో ఈ ప‌ద‌విని అలంక‌రించేందుకు నేత‌లు స‌ముఖ‌త వ్య‌క్తం చేయ‌డం  లేదు. అయినా సిఎం కేసీఆర్ ఆదేశాల‌తో ఎవ‌రో ఒక‌రు ఈ ప‌ద‌విని అలంక‌రించ‌క త‌ప్ప‌దు. ఈ ప్ర‌క్రియ పూర్త‌యితే గాని మంత్రుల చిట్టా ఫైన‌ల్ అయ్యే అవ‌కాశాలు కానరావ‌డం లేదు.