దేవి కి చెర్రీ రిటర్న్ గిఫ్ట్

Ram Charan,Devi Sri Prasad

వినయ విధేయ రామ సినిమాకి సూపర్ బజ్ ఉంది.అన్ని విషయాల్లో కూడా ఆ సినిమా టాప్ లో ఉంది అనిపిస్తుంది.కానీ ఆ సినిమా మ్యూజిక్ ముందునుండి కూడా మ్యూజిక్ లవర్స్ తో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ని సైతం డిసప్పాయింట్ చేస్తుంది.ఇంతకుముందు బోయపాటి సినిమాలకు కూడా సూపర్ మ్యూజిక్ అందించి వాటి హిట్స్ కి ఒక పిల్లర్ గా నిలిచింది దేవి శ్రీ ప్రసాద్ వినయ విధేయ రామ సినిమాకి మాత్రం మనసుపెట్టి కాకుండా మామూలుగా మ్యూజిక్ కొట్టాడు అని అర్ధమవుతుంది.ఆ సినిమా మొత్తం మీద దేవి స్టైల్ లో వినగానే కనెక్ట్ అయిపోయే పాటగాని,పూనకాలు తెప్పించే బీట్ ఉన్న పాట గాని ఒక్కటి కూడా లేకపోవడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఇంతకు ముందు ఆ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్ ప్రోమోస్ గ్రాండియర్ తో,చరణ్ ప్రెజెన్స్ తో మాత్రమే ఆకట్టుకున్నాయి.ఇక రీసెంట్ గా వచ్చిన రామా లవ్స్ సీత కూడా ట్యూన్ పరంగా చాలా రొటీన్ గా ఉంది అనే కంప్లైంట్ ని కవర్ చెయ్యలేకపోయింది.కాకపోతే లావిష్ సెట్స్,చెర్రీ డాన్సులు,కియారా లుక్స్ తో పాస్ మార్క్స్ వేయించుకుంది.రంగస్థలానికి తన పాటలతో స్ట్రాంగ్ సపోర్ట్ అందించిన దేవి ఈ సినిమా విషయంలో మాత్రం ఇలాంటి ఆల్బమ్ ఎందుకు డెలివర్ చేసాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్.సినిమా కంటెంట్ ప్రకారమే అలాంటి ట్యూన్స్ ఇచ్చాడు అని కొంతమంది అంటుంటే కొంతమంది మాత్రం గతంలో బోయపాటి తో దేవి కి ఉన్న విభేదాల కారణంగా ఈ సినిమాకి ఆబ్లిగేషన్ తో పనిచేసాడు,అందుకే అలాంటి మ్యూజిక్ ఇచ్చాడు అంటున్నారు.

అసలు నిజం బయటికి వచ్చే అవకాశం లేదు.ఈ సినిమా కంటెంట్ తో హిట్ అయితే ఆ కంప్లైంట్ లెక్కలోకి కూడా రాదు.రంగస్థలం లో దేవి ట్యూన్స్ మ్యాజికల్ గా ఉండడంతో చరణ్ కి స్టెప్స్ వేయాల్సిన స్ట్రైన్ తప్పింది.ఈ సినిమాలో దేవి మ్యూజిక్ కాస్త వీక్ గా ఉండడంతో తన డాన్స్ మూవ్స్ తో చరణ్ సపోర్ట్ ఇస్తున్నాడు.అలా అప్పడు దేవి చేసిన హెల్ప్ కి ఇప్పడు చరణ్ బదులు తీచుకున్నట్టు ఉంది సిట్యుయేషన్.