బోయపాటి చేతిలో మోసపోయిన చరణ్

Ap Govt, NTR Biopicmovie, VinayaVidheyaRamaMovie, Ap, Telangana, BalayyaHero, Ram CharanHero, Boyapati,
Ap Govt, NTR Biopicmovie, VinayaVidheyaRamaMovie, Ap, Telangana, BalayyaHero, Ram CharanHero, Boyapati,

వినయ విధేయ రామ…మెగాఫ్యాన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ కూడా అనేక ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఫస్ట్ డే నే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.సినిమా కంటెంట్ పై అనేక కంప్లైంట్స్ ఉన్నాయి.రంగస్థలం తరువాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా రెట్టింపవడం కూడా సినిమాకి మైనస్ అయ్యింది.కనీసం రొటీన్ గా ఉన్నా కూడా కాస్తో కూస్తో సేఫ్ అయ్యే పరిస్థితి ఉండేది.కానీ బోయపాటి అరాచకమయిన ఆలోచనలు ఈ సినిమా పాలిట శాపంగా మారాయి.

ఈ సినిమా లో ట్రోలింగ్ కి గురయిన ట్రైన్ సీన్ ని ట్రిమ్ చేసినా ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఇంకా అలాంటి సీన్స్ సినిమా సెకండ్ హాఫ్ లో చాలా ఉన్నాయి.వీటిని కూడా కట్ చేస్తే ఒక్క ఫైట్స్ మాత్రమే మిగులుతాయి.అందుకే వాటి జోలికి పోలేదు.ఈ కంటెంట్ తో,పండగ అండతో తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక మోస్తరు కలెక్షన్స్ తెచ్చుకుంది సినిమా.రెండు రోజుల్లో 30 కోట్లు కొల్లగొట్టడం మామూలు విషయం కాదు.అయితే ఇందులో పాతిక కోట్లు ఫస్ట్ డే వచ్చిందే.

అంటే ఈ సినిమా డ్రాపింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది.ఇక్కడ పరువు కాపాడుకున్న మెగాపవార్ స్టార్ ఓవర్సీస్ లో మాత్రం దారుణమయిన అప్రదిష్ట మూటగట్టుకున్నాడు.అక్కడ రంగస్థలం ఏకంగా మూడున్నర మిలియన్ డాలర్స్ వరకు కలెక్షన్స్ వసూలు చేసి ఎవ్వరికి అందనంత ఎత్తులో నిడబడింది.కానీ ఈ సినిమా టోటల్ రన్ లో హాఫ్ మిలియన్ మార్క్ టచ్ చెయ్యడం కూడా కష్టంగా ఉంది.శనివారం ఈ సినిమా US లో 20 వేల డాలర్స్ మార్క్ కూడా అందుకోకపోవడం ఆశ్చర్యం.

చరణ్ పడిన కష్టాన్ని బోపాటి పైత్యం ఆవిరి చేసింది.ధ్రువ,రంగస్థలం సినిమాలతో రామ్ చరణ్ సంపాదిచుకున్న ఓవర్సీస్ మార్కెట్ మైలేజ్ ని VVR పూర్తిగా తుడిచేసింది.