సీఈవో బ్లాక్‌ ఎదుట బాబు నిరసన

N Chandrababu Naidu
N Chandrababu Naidu

ఎన్నికల కమిషన్‌పై ఏపి సీఎం చంద్రబాబు ఫైరయ్యారు. అమరావతిలోని సీఈవో బ్లాక్‌ ఎదుట ఆయన నిరసనకు దిగారు. అధికారుల బదిలీలు, ఐటీ దాడులకు నిరసనగా ఆందోళనకుదిగారు. నిరసనతో ఈసీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు చంద్రబాబు. అంతకుముందు సీఈవో ద్వివేదిని కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు . అధికారుల బదిలీలు, ఐటీ దాడులపై ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే స్పందించే ఎన్నికల కమిషన్ తాము ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోలేదని ాయన మండిపడ్డారు. చంద్రబాబు ఫిర్యాదుపై ద్వివేది సానుకూలంగా స్పందించినట్లు సమాచారు.