మోదీకి చంద్ర‌బాబు బహిరంగ లేఖ

Election, Political, Ap, Andhara Pradesh, Agriculture , Tdp, Congress, Bjp,
Chandra babu naidu

పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడిచి ఇప్పుడు రిక్తహస్తాలతో మా రాష్ట్రానికి రావడం సిగ్గు అనిపించడం లేదా ? అని ప్ర‌దాని మోదీని ప్రశ్నించారు ఏపి సిఎం చంద్రబాబు. .విభజన హామీలు నెరవేర్చని ప్రధాని మోదీ ఏ మొహం పెట్టకుని రాష్ట్రానికి వస్తున్నారని ఆయ‌న నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం చేపట్టనున్న విశాఖ పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు బహిరంగ లేఖ రాశారు.

రాష్ట్ర విభజన హామీలన్నీ నెరవేర్చాకే రాష్ట్రంలో అడుగు పెట్టాలని సూచించారు . విభజన తర్వాత ఆస్తులు, అప్పుల పంపిణీలో ఏపీకి అన్యాయం చేశారన్నారు. విశాఖ పర్యటనకు ఒక రోజు ముందు రైల్వే జోన్‌ ప్రకటన చేశారని చంద్రబాబు ఆక్షేపించారు. వాల్తేర్‌ డివిజన్‌ను విడదీని ఏపీ పట్ల మోదీ తన అక్కసును మరోసారి వెళ్లగక్కారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్ర‌బాబు. మీరు చేసిన నమ్మక ద్రోహాన్ని ఈ రోజు ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ప్రతినిధిగా మరోసారి నిలదీస్తున్నాన‌న్నారు ఆయ‌న‌.