ఐకానిక్ వంతెన‌కి సిఎం చంద్ర‌బాబు శంకుస్థాప‌న

Amaravati_bridge

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు పడింది.కృష్ణా నదిపై ఐకానిక్‌ బ్రిడ్జికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిపై ఐకానిక్‌ వంతెన నిర్మిస్తున్నారు.ఇబ్రహీంపట్నం- ఉద్దండరాయునిపాలెం కలుపుతూ వంతెన నిర్మిస్తున్నారు.ఒక వేయి 387 కోట్లతో 3.2 కిలోమీటర్ల మేర ఐకానిక్‌ వంతెన నిర్మించనున్నారు.ఎల్ అండ్ టీ సంస్థ భారతీయ యోగ ముద్రతో వంతెన డీజైన్‌ చేసింది.తక్కువ పిల్లర్లు, ఎక్కువ కేబుళ్లతో వంతెన నిర్మాణం చేపడుతున్నారు.హైదరాబాద్‌, భద్రాచలం హైవేల నుంచి నేరుగా అమరావతికి వెళ్లేలా వంతెనను రూపకల్పన చేశారు.