హ‌స్తిన వేదిక‌గా సిఎం చంద్ర‌బాబు పోరుబాట

N Chandrababu Naidu
N Chandrababu Naidu

హస్తిన వేదికగా ఎన్నికల సంఘంపై, కేంద్ర సర్కార్‌పై పోరుకు సిద్ధం కావాలని, అందరూ కలిసి రావాలని చంద్రబాబు విపక్ష పార్టీలను కోరారు. దేశరాజధాని ఢిల్లీలో మరోసారి ధర్నా చెయ్యాలని ఏపి సియం చంద్రబాబు సంకల్పించారు. మంగళవారం మధ్యాహ్నం అన్ని పార్టీలతో కలిసి ధర్నా చేయనున్నట్లు ఆయ‌న ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం తీరు, ఈవిఎంల పనితీరు వివి ప్యాట్ల లెక్కింపు వంటి అంశాలపై నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. సులభంగా నిర్వహించాల్సిన ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వివాదాస్పదం చేసిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ప్రధాని మోది అందరినీ బ్లాక్‌మెయిల్‌ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు.