చంద్రబాబు చేయని డ్రామా.. చూపించని సినిమా ఉండద‌న్న‌ది ఎవ‌రో తెలుసా ..!

YS Jagan
YS Jagan

ఓటర్‌ లిస్టు నుంచి పేర్లను తొలగిస్తున్నార‌ని, వైసీపీకి అనుకూలంగా ఉన్నవారిని ఓటర్‌ లిస్టు నుంచి తొలగిస్తున్నారని జగన్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 59 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. దొంగ ఓట్ల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని జగన్‌ సూచించారు.

అనంతపురం జిల్లాలో వైసీపీ బూత్ స్థాయి కార్యకర్తలతో జరిగిన సమర శంఖారావం సభలో జగన్ మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేస్తామన్నారు . చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు ఎవరూ మోసపోవద్దని, వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు దశల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు.

చంద్రబాబు డబ్బులిస్తే తీసుకోవాలని.. ఓటు మాత్రం వైసీపీకి వేయాలని జగన్ పిలుపు ఇచ్చారు. మరో నెల రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతోందన్నిరు జగన్. ఇంకో 3 నెలలలోపు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత కార్యకర్తల భుజస్కందాలపై ఉందని వ్యాఖ్యానించారు జ‌గ‌న్ .