పోలింగ్‌ తీరుపై CEC కి చంద్రబాబు ఫిర్యాదు

AP CM Chandra Babu Naidu
AP CM Chandra Babu Naidu

కేంద్ర ఎన్నికల ప్రధాన‌ కమిషనర్ లతో తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపి సిఎం చంద్రబాబు, పార్టీ నేతల బృందం భేటీ అయింది.

ఏపీలో ఎన్నికలు జరిగిన తీరుపై ఈసీకి వీరంతా ఫిర్యాదు చేశారు.

ఈవీఎంలు పనిచేయకపోవడం, ఆలస్యంగా పోలింగ్ జరిగినా అదనపు సమయం ఇవ్వకపోవడం, రీపోలింగ్ అంశాలపై ఈసీకి నివేదిక అందజేశారు సిఎం చంద్రబాబు. వివిధ జిల్లాలలో జరిగిన అల్లర్లను ఎన్నికల అధికారుల ముందుకు తీసుకు వెళ్లారు.

గతంలో టిడిపి ఇచ్చిన ఫిర్యాదులపైనా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు చంద్రబాబు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ని రావణకాష్టంగా మార్చాలనుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందని, ఓటర్లు ఈసీకి భిక్షగాళ్లలా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే ప్రజలు కంకణం కట్టుకున్నారని, ఈవీఎంలపై ప్రతి ఒక్కరికి అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు.