70వ వసంతంలోకి అడుగుపెట్టిన ఏపి సిఎం

N Chandrababu Naidu
N Chandrababu Naidu

తెలుగు గడ్డపై జన్మించి ఇక్కడి ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం ఎన్నో జన్మల పుణ్యఫలం అన్నారు ఏపి సియం చంద్రబాబు . ఇన్ని సంవత్సరాల్లో ప్రజలు చూపిన అభిమానం, ఆదరణ, వాత్సల్యం, ఇవన్నీ తన శక్తిని, ఉత్సాహాన్ని పదిరెట్లు చేసి తన కార్యసాధనకు మరింత ప్రేరేపించాయని ట్విట్టర్‌లోవెల్ల‌డించారు. మ‌రోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయ‌న జ‌న్మ‌దినోత్స‌వాన్ని ఆంద్ర‌ప్ర‌దేశ్ లోని అన్ని జిల్లాల పార్టీ కార్యాల‌యాల్లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలు, అభిమానులతో క‌ల‌సి సిఎం చంద్ర‌బాబు కేక్ క‌ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, మంత్రులు, కార్య‌క‌ర్త‌లు శుభాకాంక్ష‌లు తెలిపారు.