వైసిపిని న‌మ్ముకుంటే జైలుకు.. పవన్ ను నమ్ముకుంటే అత్తారింటికి..!

Chandrababu Naidu
Chandrababu Naidu

కోడికత్తి పార్టీని నమ్ముకుంటే జైలుకు వెళ్లాల్సిందేనన్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయ‌న మాట్లాడారు. పవన్ ను నమ్ముకుంటే అత్తారింటికి వెళ్తారన్నారు. త‌న‌ను నమ్ముకుంటే మీ భవిష్యత్ బ్రహ్మాండంగా ఉంటుందన్నారు చంద్రబాబు. ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్లినా మోడీని బ్యాన్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు. కోడికత్తి పార్టీకి ఓటేస్తే… మోడీకి వేసినట్లేనన్నారు. మోదీని డిల్లీ నుంచి గుజరాత్ పంపించే వరకూ వదిలిపెట్టనన్నారు ఆయ‌న‌.

ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా మోదీని బ్యాన్ చేసే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. నరేంద్ర మోదీ ఉగ్రవాదితో సమానమని, నాటి గోద్రా అల్లర్లలో రెండు వేల మంది మృతి కారకుడు మోదీనే అని తీవ్ర ఆరోపణలు చేశారు సిఎం చంద్ర‌బాబు. 18నుంచి 25 ఏళ్ల లోపు యువత ఆలోచించాలన్నారు. ఆలోచించి ఓట్లు వేయాలన్నారు. త‌న‌కు , జగన్ కు ఏమైనా పోలిక ఉందా అని చంద్రబాబు ప్ర‌శ్నించారు. తండ్రిని అడ్డు పెట్టుకొని లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి అన్నారు జగన్ ..