ఎన్టీఆర్ బ‌యోపిక్ చూసి సిఎం చంద్ర‌బాబు ఏమ‌న్నారో తెలుసా…

Chandra Babu Naidu

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ నటించి, నిర్మించిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు.ఈ మూవీని దర్శకుడు క్రిష్, నటులు బాలకృష్ణ, నారా రోహిత్, మంత్రి దేవినేని ఉమ, పలువురు టీడీపీ నేతలలో కలిసి విజ‌య‌వాడ‌లోని క్యాపిటల్ థియేటర్‌లో సిఎం చంద్ర‌బాబు వీక్షించారు.ఈ సినిమా అందరికీ స్ఫూర్తినిస్తుందన్నారు ఆయ‌న‌.ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన సినిమా ఇదంటూ కితాబిచ్చారు.

సినిమా చాలా అద్భుతంగా ఉందని, పాత రోజులన్నీ గుర్తుకొస్తున్నాయని చంద్రబాబు వివ‌రించారు. ఎన్టీఆర్‌కు సంబంధించిన ఎన్నో విలువైన విషయాలను ఈ మూవీలో చూపించారన్నారు సిఎం చంద్ర‌బాబు.ఎన్టీఆర్ కథానాయకుడు మూవీలో త‌న పాత్ర‌పై మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధాన‌మిస్తూ… నా పాత్ర ఎలా ఉందన్నది నా కంటే మీరే బాగా చెప్పగలరంటూ దాట‌వేశారు.