అవాస్తవాలు ప్రచారం చేయవద్ద‌న్న ఈసీ

CEO Rajat Kumar addressing media on complaints received by EC.
CEO Rajat Kumar addressing media on complaints received by EC.

సామాజిక మాధ్యమాల్లో ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నార‌ని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల‌న్నారు తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి ర‌జ‌త్ కుమార్ . అవాస్తవాలు ప్రచారం చేయవద్ద‌ని, కల్పిత కథనాలతో ప్రతి ఒక్కరికీ అనుమానాలు వచ్చే అవకాశం ఉందన్నారు ఆయ‌న‌. హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. జగిత్యాలలో ఆటోలో రవాణా చేసిన ఈవీఎంలను పోలింగ్‌ కోసం వాడలేదని, అవి అవగాహన‌ కోసం వాడిన యంత్రాలు మాత్రమేనని రజత్‌కుమార్‌ స్పష్టంచేశారు. తప్పుడు ప్రచారం చేసినవారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్ట్రాంగ్‌రూంలో ఫోటోలు తీసుకున్న వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. ఫోటోలు తీసుకున్న వ్యక్తిపై న్యాయవిచారణ జరుగుతోందన్నారు.