కేంద్ర మాజీ మంత్రి అశోక గ‌జ‌ప‌తిరాజు అలిగారా ..!

ashokgajapathiraju
ashokgajapathiraju

తెలుగుదేశం పార్టీలో సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అల‌క‌బూనార‌ట‌. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తిగా వున్నార‌ట‌. అందుకే ఇవాళ జ‌రిగిన పార్టీ పొలిట్ బ్యూరో స‌మావేశానికి అశోకుడు డుమ్మా కొట్టార‌ని స‌మాచారం. ఎన్నిక‌ల వేళ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.

తన సొంత లోక్ సభ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమానికి కూడా అశోక గ‌జ‌ప‌తి గైరు హాజ‌రు కావ‌డం పార్టీ శ్రేణుల్లో చ‌ర్చ‌కు దారి తీసింది. హ‌స్తిన‌లో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కిశోర్ చంద్రదేవ్ తో సమావేశమైన విషయాన్ని సిఎం చంద్రబాబు తనతో చర్చించకపోవడంపై అశోక్ గజపతిరాజు కినుక వ‌హించార‌ని గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి. అందుకే ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా వుంటున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి.