నటి సోనాక్షిసిన్హా సహా ఐదుగురి పై ఛీటింగ్ కేసు

ఢిల్లీలో జరిగే ఓ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి నటి సోనాక్షి సిన్హాను ఈవెంట్ మేనేజర్ ప్రమోద్ శర్మ ఆహ్వానించాడు. సోనాక్షిని ఈవెంట్ కు తీసుకురావడం కోసం ఓ కంపెనీకి రూ.24 లక్షలు ఇచ్చాడు. అయితే సోనాక్షి ఈ కార్యక్రమానికి రాకపోవడంతో ప్రమోద్ శర్మ గతేడాది నవంబర్ 24న కాట్ ఘర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ప్రమోద శర్మ ఫిర్యాదు మేరకు సోనాక్షితోపాటు మరో నలుగురిపై పలు సెక్షన్ల కేసు నమోదు చేశామని, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని మొరాదాబాద్ ఎస్ఎస్పీ రవిందర్ గౌడ్ చెప్పారు. సోనాక్షి సిన్హాకు ప్రమోద్ శర్మ మొత్తం 37 లక్షలు చెల్లించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆయన చెప్పారు.