పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫైన‌ల్ ప్ర‌చారానికి తెర

Telangana Panchayat Polls
Telangana Panchayat Polls

తెలంగాణ‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల తుది విడత ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. మూడు విడతల కోసం ప్రకటించిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌లో ఇప్పటికే రెండు విడతల షెడ్యూల్ పూర్తి అయింది. మూడో విడత షెడ్యూల్‌లో భాగంగా 4 వేల 116 గ్రామ సర్పంచ్‌లు, 36 వేల 729 వార్డు సభ్యుల పదవులకు ఈ నెల 16న నోటిఫికేషన్‌ జారీ చేశారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు అనంతరం అభ్యర్థుల జాబితా వెల్లడించారు.

ఇందులో 573 సర్పంచ్‌ పదవులు, 8 వేల 956 వార్డు సభ్యుల పదవులకు ఒక్కో నామినేషన్‌ మాత్రమే మిగలడంతో ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. ఈనెల 30న ఎన్నికలు నిర్వహించ‌నున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. అనంత‌రం మధ్యాహ్నం 2 గంటల నుంచి లెక్కింపు ప్రారంభించి ఫలితాలు వెల్లడిస్తారు.