కేబినెట్ కూర్పుపై సిఎం జ‌గ‌న్ క‌స‌ర‌త్తులు

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

ఏపి సిఎం జగన్‌ మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్‌ఆర్‌సిపి ముఖ్యనేతలతో చర్చిస్తున్నారు. కేబినెట్‌ విస్తరణకు ముహూర్తంతోపాటు ఎవరెవరికి స్థానం కల్పివచాలనే విషయాలపై సిఎం కసరత్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే మంత్రుల ప్రమాణ స్వీకారానికి తేదీ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. జూన్‌ 8న కేబినెట్‌ విస్తరణ జరిగే అవకాశముంది. జగన్‌ తన మంత్రివర్గంలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకూ స్థానం కల్పించాలని ఆలోచిస్తున్నారు. అయితే జగన్‌ పాదయాత్ర, ఎన్నికల ప్రచారం సందర్భంలో కొందరు నేతలకు మంత్రులుగా అవకాశం కల్పిస్తానని ఇప్పటికే హామీ ఇచ్చారు. ఇటు సిఎం జగన్ కూడా జూన్ 8న ఏపీ సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. ఉదయం 9 గంటల లోపు తన చాంబర్ లో ప్రవేశించనున్నారు.