బోయపాటి సినిమా నుంచి తప్పుకున్న బాలకృష్ణ…!

Boyapati Srinu, Nandamuri, Balakrishna, Vinaya Vidheya Rama, Pre Production,
Balakrishna

‘ఎన్టీఆర్’ బయోపిక్ ఆడియో లాంచ్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ,బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్ళే అవకాశం ఉంది.అంతేకాదు ఈ సినిమాను తన సొంత బ్యానర్ ఎన్‌బికే లో నిర్మించనునట్లు తెలిపారు .అయితే బాలకృష్ణ ఈ ఏడాది ‘ఎన్టీఆర్’ బయోపిక్ రెండు భాగాలతో భారీ ఫ్లాప్స్‌ని చవిచూసాడు. సీనియర్ ఎన్టీఆర్ మీద బయోపిక్ తీస్తే తప్పకుండా చూస్తారనే నమ్మకంతో గుడ్డిగా వెళ్లి బోల్తా పడ్డాడు బాలయ్య.

క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని వారాహి చలన చిత్రం వాళ్ళతో కలిసి బాలకృష్ణ ప్రొడ్యూస్ చేసాడు. అయితే బోయపాటి సినిమాని మొదట నందమూరి బాలయ్య తన ఎన్‌బికే ఫిలిమ్స్‌పై తానే స్వయంగా ప్రొడ్యూస్ చేస్తూ వారాహి వాళ్ళని కూడా పార్టనర్స్‌గా పెట్టుకుందాం అనుకున్నారు.అయితే తాజాగా తాను ప్రొడ్యూసర్‌గా తప్పకోవడమే కాక వారాహి వాళ్లకు కూడా ఛాన్స్ ఇవ్వకుండా సినిమాను ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ సి. కళ్యాణ్‌కు ఇచ్చినట్లు సమాచారం.