బాబు పార్టీలో బైరెడ్డి ..!

Byreddy Rajasekhar Reddy
Byreddy Rajasekhar Reddy

తాను ఎక్కడ వున్నా రాయలసీమ హక్కుల కోసం పోరాడతానని స్పష్టం చేశారు భైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి. సిఎం చంద్రబాబు ఆదేశిస్తే శ్రీశైలం నుంచి పోటీ చేసేందుకు రెఢీగా ఉన్నట్టు ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబుని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కలిశారు. కర్నూలు జిల్లా రాజకీయాల గురించి ఆయ‌న‌తో చర్చించినట్టు వివ‌రించారు.

టీడీపీలో తనను చేరమని, ఏపీ అభివృద్ధికి అందరం కలిసి పాటు పడదామని ముఖ్య‌మంత్రి చెప్పినట్టు భైరెడ్డి తెలిపారు. వైసిపి అధ్యక్షుడు జగన్‌కు ఓటేస్తే రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోతుందన్నారు ఆయ‌న‌. విభజన తర్వాత ఏపీ క్లిష్ట పరిస్థితిలో ఉందని,

ఇటువంటి రాష్ట్రాన్ని మరో ఐదేళ్లు కష్టపడి ముందుకు తీసుకెళితే తప్ప ప్రజలకు ఉపయోగం ఉండదన్నారు. అందుకే చంద్రబాబుకే ఓటెయ్యాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.